తెలంగాణ రాజధాని గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకి దిగాయి. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు,వివిధ జిల్లాల మహిళా ప్రెసిడెంట్లు పీసీసీ చీఫ్ కార్యాలయం ముందు బైఠాయించారు. పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో మహిళా కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలు మార్లు PCC చీఫ్ ను కలిసినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై నాయకులు దృష్టిపెట్టాలని కోరారు.