Road Accident: కాలుపైకి ఆర్టీసీ బస్సు ఎక్కడంతో మహిళ మృతి..
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళపై అరగంటకు పైగా ఆర్టీసీ బస్సు ఉండిపోవడంతో నరక యాతన అనుభవించిన ఆమె చివరకు ప్రాణాలు వదిలింది.;
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళపై అరగంటకు పైగా ఆర్టీసీ బస్సు ఉండిపోవడంతో నరక యాతన అనుభవించిన ఆమె చివరకు ప్రాణాలు వదిలింది. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
సి. బెళగల్ మండలం కృష్టందొడ్డికి చెందిన గొల్ల మద్దిలేటి, గోవిందమ్మ దంపతులు బేతం చర్లలోని అయ్యల చెరువువద్ద ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆదివారం సాయింత్రం దంపతులిరువురూ ద్విచక్రవాహనంపై వెళుతున్నారు. ఇంతలో కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెడుతున్న ఆర్టీసీ బస్సు వీరి బండిని ఢీకొంది.
దీంతో బండి మీద ఉన్న ఇద్దరూ ఎగిరి కిందపడ్డారు. గోవిందమ్మ కాలిపై బస్సు ఎక్కడంతో విలవిలలాడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మద్దిలేటికి చికిత్స జరుగుతోంది. గోవిందమ్మ కాలిపై బస్సు నిలిచిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. ఎవరి సాయమూ అందక ఆమె కాలు బస్సు టైరు కిందే అరగంటపాటు ఉండిపోయింది. దీంతో ఆమె మృతి చెందిందని భర్త మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశాడు.