Harish Rao : 55 ఏళ్లు నిండిన వాళ్లందరికీ పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నాం: హరీష్‌రావు
Harish Rao : సంగారెడ్డిలో డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు..;
Harish Rao (tv5news.in)
Harish Rao : సంగారెడ్డిలో డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి పాల్గొన్నారు.. పేద మహిళలు కట్టిన డబ్బు కిస్తీతో సహా ఇవ్వడంతోపాటు పెన్షన్ డబ్బు కూడా ఇవ్వమని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి హరీష్‌రావు అన్నారు.. 545 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని సంగారెడ్డిలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 55 ఏళ్లు నిండిన వాళ్లందరికీ పెన్షన్ మంజూరు చేస్తామన్నారు.. కేసీఆర్ చలవతోనే మహిళల చేతినిండా డబ్బులున్నాయని హరీష్‌రావు చెప్పారు. ఎంతో కష్టపడి పనిచేసి సంగారెడ్డి జిల్లాను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారన్నారు.. డీసీసీబీ బ్యాంకుల దెబ్బకు జాతీయ బ్యాంకులు కూడా దిగివచ్చాయన్నారు..