World Boxing Championship: శభాష్ జరీన్... సీఎం కేసీఆర్ అభినందనలు

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్..;

Update: 2023-03-27 06:33 GMT

అంతర్జాతీయ బాక్సింగ్ రిగ్ లో మరోసారి హైదరాబాదీ పంచ్ అదిరింది. గోల్కొండ తేజం నిఖత్ జరీన్ న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. 50 కేజీల విభాగంలో వియత్నం బాక్సర్ నుయెన్ పై 5-0 తేడాతో పసిడి పతాకాన్ని కైవసం చేసుకుంది. ఆమె కెరీర్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకోవడం ఇది రెండవసారి కావడం విశేషం. ఇక సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ సహా నిఖత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మరోసారి వెల్లడించారు. 

Tags:    

Similar News