Canada PM : యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు: కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రశంస

Update: 2025-09-01 07:00 GMT

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ ఆలయ సేవలను అభినందిస్తూ ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. కెనడాలోని ఒట్టావా నగరంలో జరిగిన లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం, దాని నిర్వహణ తీరుతెన్నులను ప్రత్యేకంగా కొనియాడారు.

హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికత, ఐక్యతను ప్రశంసిస్తూ మార్క్ కార్నీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 27 వరకు కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు జరుగుతున్నాయని కూడా తెలిపారు. కెనడా ప్రధాని లేఖపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. భక్తులకు స్వామివారి సేవలను మరింత విస్తృతం చేస్తామని ఈవో వెంకట్రావు ఈ సందర్భంగా తెలిపారు. యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆలయ ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News