Girl Protest At Vemulawada: మోసం చేసిన బావ.. ఇంటి ముందు మరదలి నిరసన

Young Girl Protest At Vemulawada: ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పగానే నమ్మి మోసపోతున్నవారు ఇంకా ఉన్నారు.;

Update: 2021-09-30 09:57 GMT

 Young Girl Protest At Vemulawada: ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అబ్బాయి చెప్పగానే నిజమేనని నమ్మి మోసపోతున్న అమ్మాయిలు ఇంకా ఉన్నారు. అందులో కొంతమంది మన కర్మ అని మోసం చేసినవాడిని వదిలేస్తుంటే.. కొందరు మాత్రం ఎందుకు వదిలేయాలి అని న్యాయం కోసం పోరాడుతున్నారు. అలాగే రెండేళ్ల నుండి ప్రేమిస్తున్నాని చెప్పి మోసం చేసిన మేనబావ ఇంటి ముందు బైఠాయించింది ఓ యువతి. ఈ ఘటన వేములవాడ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది.

వేములవాడ మున్సిపల్‌ పరిధి తిప్పాపూర్‌కు చెందిన ఎదురుగట్ల రాము అదే కాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే ఇప్పుడు తన తల్లి మాటలు విని తనను దూరం పెడుతున్నాడని గౌతమి వాపోతుంది. ఈ విషయంపై నాలుగు రోజులు ముందు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రాము, గౌతమిలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఆ తర్వాత రామును నేరుగా కలవడానికి గౌతమి తన ఇంటికి వెళ్లింది. కానీ ఆ సమయంలో ఇంటికి తాళం వేసుంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ రెండు రోజుల నుండి బాధితురాలు మేనబావ ఇంటి ముందే బైఠాయించింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించింది.

Tags:    

Similar News