Hyderabad: మెట్రో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య..
Hyderabad: హైదరాబాద్, మూసాపేట్‌లో మెట్రో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.;
Hyderabad Metro: హైదరాబాద్, మూసాపేట్‌లో మెట్రో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. టికెట్ లేకుండా లోపలికి ఎంటర్ అయిన యువకుడు.. సరిగ్గా రైలు వచ్చే సమయానికి దాని కింద దూకేశాడు. రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య నలిగి యువకుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి ఆత్మహత్యపై మెట్రో అధికారులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు ఎవరు, అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.