Hanumakonda District : ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

Update: 2025-07-05 11:00 GMT

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా చిన్న కూతురు రావుల ప్రత్యూష(24) ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తుంది. అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ప్రత్యూష. కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి ఇంట్లోకి వచ్చి చూసి.. భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది. తల్లిదండ్రులు కూలీలు. ప్రత్యూష తండ్రి రావుల రమేశ్‌ ఫిర్యా దుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్‌ తెలిపారు.

Tags:    

Similar News