Karimnagar: కరీంనగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఉద్యోగం కోసం ప్రయత్నించి..
Karimnagar: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.;
Karimnagar: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్లలో చోటుచేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రశాంత్ అనే యువకుడు రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. రెండు సార్లు కానిస్టేబుల్ ఉద్యోగానికి, మిలటరీలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లోనూ ఉద్యోగం రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.