నేటి యువతలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. కొంతమంది యువకులు రీల్స్ చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్నే ఎంచుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది.
దీంతో ఈ ఆకతాయిలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ముందు వీళ్లని సెల్ లో వేయండి సర్.. అంటూ ఓ నెటిజన్ ఫైర్ కాగా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో.. అని మరొకరు కామెంట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ను మరో నెటిజన్ ట్యాగ్ చేశాడు.