YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోంది: షర్మిల కామెంట్లు
YS Sharmila: తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.;
YS Sharmila: తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. కేవలం కేసీఆర్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందన్నారామె. కేసీఆర్‌కు కొత్తఅర్థం చెప్పారు షర్మిల. కే అంటే కొట్టు.. . సీ అంటే చంపు..... ఆర్ అంటే రాజ్యాంగం అంటూ ఎద్దేవా చేశారామె.
తెలంగాణలో ప్రజాసమస్యలపై మాట్లాడితే దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఓ నియంతలా పరిపాలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం అంతా నాటకాల కుటుంబమని.... ఆ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు, ప్రజల తరపున నిలబడే పార్టీని ప్రజలు ఆదరించాలని అప్పుడే మళ్లీ వైఎస్ సంక్షేమ పాలన సాధ్యమన్నారు.