YS Sharmila: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండే పోటీ చేస్తా: వైఎస్‌ షర్మిల

YS Sharmila: వచ్చే ఎన్నికల్లో గురించి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిల సంచలన ప్రకటన చేశారు.;

Update: 2022-06-19 12:20 GMT

YS Sharmila: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిల సంచలన ప్రకటన చేశారు. తాను పాలేరు నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వారి కోరిక మేరకు తాను పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎంత మంది వైఎస్సార్‌ ఫోటో పెట్టుకొని గెలిచారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌ వారసత్వం కేవలం ఆయన బిడ్డగా తనకే ఉందన్నారు. ఇతర వ్యక్తికి ఇతర పార్టీకి ఆ హక్కులేదన్నారు. వైఎస్‌ఆర్‌ మీద ఉన్న అభిమానం మన ఆస్తి అన్నారు.

Tags:    

Similar News