YS Sharmila YSRTP : హస్తం పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం..!
వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడినట్లుగా తెలుస్తోంది;
వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం దిశగా మరో అడుగు ముందుకు పడినట్లుగా తెలుస్తోంది.. హస్తం పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనానికి ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్ జయంతి రోజయిన జులై 8న కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం జరుగుతుందని తెలుస్తోంది.. పార్టీ విలీనం, షర్మిల పాత్ర, బాధ్యతలకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు పూర్తయినట్లు సమాచారం.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఏఐసీసీ ముఖ్యులు, షర్మిల భర్త అనిల్ సహా ఆమె సన్నిహితుల మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్‌తోనూ షర్మిల రెండుసార్లు సమావేశమయ్యారు.. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక ఇడుపులపాయను సందర్శించి వైఎస్‌కు నివాళులర్పించనున్నారు.. రాహుల్ గాంధీ ఢిల్లీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.. తెలంగాణతోపాటు ఏపీలోనూ షర్మిల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలనేదే కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతోంది.. ప్రధానంగా ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవంతోపాటు జగన్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా హస్తం పార్టీ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.