తండ్రికి అంత్యక్రియలు చేసిన 12మంది కుమార్తెలు!
కుమార్తెలంటే తల్లిదండ్రులకు భారం కాదని కొడుకులైనా, కూతుల్లైనా ఒకటేనని రుజువుచేసేన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.;
కుమార్తెలంటే తల్లిదండ్రులకు భారం కాదని కొడుకులైనా, కూతుల్లైనా ఒకటేనని రుజువుచేసేన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వాషీమ్ జిల్లా షెందుర్జన్ గ్రామానికి చెందిన సఖారామ్ గణపతిరావు కాలే (92) జనవరి 28న కన్నుమూశారు. ఆయనకి 12 మంది సంతానం ఉన్నారు. అయితే ఆ 12 మంది కూడా కుమార్తెలు కావడం విశేషం.
అయితే గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడించారు. అయన అంత్యక్రియలుకి ఊరు ఊరంతా హాజరయ్యింది. అయన 12మంది కుమార్తెలు తమ తండ్రి పాడె స్మశానవాటిక వరకూ మోసి, అనంతరం చితికి నిప్పంటించారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము 12మంది అక్కాచెల్లెళ్లమని తమ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి అయన చివరి కోర్కెను తీర్చామన్నారు. ఈ ఘటన పైన గ్రామస్థులు మాట్లాడుతూ.. కొడుకులే కాదు కూతుళ్లు కూడా కర్మకాండలను చేయలగరని నిరూపించారని అంటున్నారు. కాగా సెప్టెంబరు 14, 1930లో జన్మించిన గణపతిరావు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు.