Amethi : అమేథీలో దళిత బాలికపై దాష్టీకం .. దొంగతనానికి పాల్పడిందని
Amethi : అమేథీలో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడిందనే నేపంతో దళిత బాలకను చితకబాదింది ఓఅగ్రవర్ణ కుటుంబం.;
Amethi : అమేథీలో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడిందనే నేపంతో దళిత బాలకను చితకబాదింది ఓఅగ్రవర్ణ కుటుంబం. ఇద్దరు వ్యక్తులు ..బాలికను నేలపై పడేసి గట్టిగా పట్టుకోగా.. మరో వ్యక్తి కర్రతో ఆమె పాదాలపై దారుణంగా కొట్టాడు. మరోవైపు ముగ్గురు మహిళలు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. దెబ్బలకు బాలిక విలవిల్లాడుతున్న వారు కనికరించలేదు. పైగా జుత్తు పట్టుకుని ఈడ్చుకు వెళ్లారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అటు ఈఘటనపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. నిందితులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.