ఒంటరిగా యువతి.. వెంటాడిన కుక్కల గుంపు.. ఆమె చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..!
సోషల్ మీడియాలో చాలా రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఆహ్లదాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి.;
సోషల్ మీడియాలో చాలా రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఆహ్లదాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఇప్పుడు.. సాధారణంగా ఎవరైనా కుక్కలు కనిపిస్తే భయపడుతుంటారు. ఇంకా రాత్రి సమయాల్లో కుక్కలు కనిపిస్తే ఆ భయమే వేరు. అలాంటిది కుక్కలా గుంపు కనిపిస్తే.. ముందుగా అక్కడి నుంచి పారిపోడానికి ట్రై చేస్తాం.. కానీ ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా ట్రై చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాత్రి సమయంలో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది.
ఆ సమయంలో ఒక్క సారిగా ఆ యువతిని శునకలన్ని ఆమెను చుట్టుముట్టాయి. దీనితో ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక డ్యాన్స్ చేసింది. అవును మీరు విన్నది నిజం.. ఆ అమ్మాయి కుక్కలను చూసి బెదిరిపోకుండా తనలో ఉన్న డాన్స్ కలని బయటకు తీసింది. ఆమె చేసిన ఆ డాన్స్ ఆ శునకలకి బాగా నచ్చింది కావచ్చు.. అలా చూస్తూనే కూర్చున్నాయి. అదే దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు భలే సమయస్ఫూర్తి అంటూ ఆమెను పొగుడుతున్నారు.