Video Viral: పార్శిల్ ఓపెన్ చేసి షాక్.. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే..
Video Viral: ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు.. కానీ ఆనందంతో అందరికీ చెప్పేశాడు.. అదేనండి ఆపిల్ ఐ ఫోన్ 13 ఆర్డర్ పెడితే.. 14 వచ్చింది. దాంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. విషయాన్ని అందరికీ వివరించేశాడు.;
Video Viral: ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు.. కానీ ఆనందంతో అందరికీ చెప్పేశాడు.. అదేనండి ఆపిల్ ఐ ఫోన్ 13 ఆర్డర్ పెడితే.. 14 వచ్చింది. దాంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. విషయాన్ని అందరికీ వివరించేశాడు.
ఐఫోన్ 14 లాంఛ్ చేసినప్పటినుండి ఐఫోన్ 13కి దానికి తేడా ఏంటి. దాదాపు ఫీచర్లన్నీ ఒకేలా ఉన్నాయి కదా అని అనుకున్నారు. కానీ ధరలో మాత్రం చాలా వేరియేషన్ ఉంది అని కస్టమర్లు కొనడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయినా ఐఫోన్ ఉంటే ఆ లెవలే వేరని అంత రేటు పెట్టి కూడా కొనేవాళ్లు కొందరున్నారు.
ఐఫోన్ 13 ధర దాదాపు 60వేలు, ఐఫోన్ 14 ధర 80 నుండి 1 లక్షల మధ్య ఉంటుంది. ఒక ట్విట్టర్ వినియోగదారు ఐఫోన్ 14 గురించి ఒక సంఘటనను పంచుకున్నారు. అతడు iPhone 13ని ఆర్డర్ చేస్తే iPhone 14 వచ్చిందట ఫ్లిప్‌కార్ట్ పార్సిల్‌లో. గతంలో ఒకరికి ల్యాప్ ట్యాప్ బుక్ చేస్తే ఘడీ డిటర్జెంట్ సోపులు వచ్చిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ బుక్ చేసిన ఆర్డర్లలో ఒక్కోసారి ఇలాంటి అవకతవకలు జరగడం సర్వసాధారణం. విషయం తెలుసుకున్న సందరు కంపెనీ కస్టమర్‌కి కాల్ అతడు ఆర్డర్ చేసిన ఫోన్‌ని పంపించింది. ఐఫోన్ 14ని తిరిగి తీస్కెళ్లిపోయింది.
One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ
— Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022