జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూసి పాడిన ఎంపీడీవో!

72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ ఆలపించారు ఓ ఉన్నతాధికారి. ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది.;

Update: 2021-01-26 10:03 GMT

72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ ఆలపించారు ఓ ఉన్నతాధికారి. ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. తరిగొప్పుల మండల కార్యాలయంలో ఎంపీడీవో ఇంద్రసేనా రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఫోన్‌లో చూస్తూ పాడారు. ఓ ఉన్నతాధికారి స్థాయిలో ఉండి అలా చేయటంతో.. ఎంపీడీవో పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ స్థాయిలో ఉండి అలా చేయడం ఏంటని ఎద్దేవా చేశారు. జాతీయ గీతం కూడా నోటికి గుర్తు ఉండదా.. అసలు ఎంపీడీవో ఎలా అయ్యారని ఎంపీడీవోపై ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News