Argentina: కళ్లు తిరిగి ట్రెయిన్ కింద పడిపోయిన యువతి.. అయినా కూడా..
Argentina: అర్జంటీనాలో రైలు కోసం వెయిట్ చేస్తున్న ఓ యువతి ఉన్నట్టుండి కళ్లు తిరిగి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది.;
Argentina: కొంతమంది ఎన్ని ప్రమాదాలు ఎదుర్కున్నా కూడా ప్రాణాలతో బతికి బయటపడగలుగుతారు. అలాంటి వారిని చూసినప్పుడే వారి ఆయువు గట్టిగా ఉంది అనుకుంటూ ఉంటాం. అయితే రైలు ప్రమాదం అనేది జరిగిన తర్వాత ఓ మనిషి బ్రతికి బయటపడడం అనేది ఓ వింతే. కానీ అలాంటి వింతే అర్జంటినాలో చోటుచేసుకుంది. ఓ యువతి స్పృహ తప్పి రైలు కింద పడిపోయింది. ఆమె చనిపోయింది అనుకున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అర్జంటీనాలో బ్యూనస్ ఎయిర్స్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం వెయిట్ చేస్తున్న ఓ యువతి ఉన్నట్టుండి కళ్లు తిరిగి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. అప్పటికే రైలు స్పీడ్‌గా దూసుకొచ్చింది. దీంతో తాను చనిపోయిందేమో అనుకున్నారంతా. రైలు వెళ్లిపోయిన తర్వాత స్థానికులు వెళ్లి ఆమెను బయటికి తీశారు. అప్పటికీ ఆమె ప్రాణాలతో సురక్షితంగానే ఉంది. ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఈ ఘటన గురించి ఆమెను అడిగారు.
తనకు రక్తపోటు ఉందని ఆ యువతి తెలిపింది. ఇదే విషయాన్ని తన పక్కన ఉన్న వ్యక్తిని చెప్పే క్రమంలో తనకు కళ్లు తిరిగినట్టు అయ్యిందని చెప్పింది. అయితే కళ్లు తిరిగి రైల్వే ట్రాక్ మీద పడడం వరకే తనకు గుర్తుందని, తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తులేదని యువతి చెప్పుకొచ్చింది. ఆ యువతి పేరు క్యాండెల అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
So this happened recently in #BuenosAires #Argentina
— Diamond Lou®™ 🔞 (@DiamondLouX) April 19, 2022
This woman apparently fainted and she fell under on an oncoming train, BUT SHE SURVIVED! She's now out of the hospital 🙏 pic.twitter.com/EQA2V4foh9