ట్రైన్‌ ఎక్కబోయి జారి పడిపోయిన మహిళ.. మెరుపు వేగంతో కాపాడిన కానిస్టేబుల్‌..!

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళకు ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.;

Update: 2021-07-31 10:31 GMT

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళకు ప్రమాదం తృటిలో తప్పింది. రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తతతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. రైలు వెళ్లిపోతోందన్న హడావుడిలో ఓ మహిళ రన్నింగ్‌లో ట్రైన్‌ ఎక్కబోయింది. అయితే పట్టుతప్పి రైలు కింద పడబోయింది. ఇంతలో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్‌ మెరుపు వేగంతో స్పందించాడు. మహిళను చేతులు పట్టుకుని ప్లాట్‌ ఫామ్‌ పైకి లాగేశాడు.

Tags:    

Similar News