ఆవు పిడకలు రుచిగా లేవు... తిన్నాక లూజ్ మోషన్స్! - ఓ డాక్టర్ రివ్యూ
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో దొరకనిది అంటూ ఏది లేదు.. నిత్యావసర వస్తువుల నుంచి పండగలకి ఉపయోగించే పండగ సామాగ్రి వరకు.. ప్రతి ఒక్కటి అమెజాన్‌లో మనకి దొరుకుతుంది.;
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో దొరకనిది అంటూ ఏది లేదు.. నిత్యావసర వస్తువుల నుంచి పండగలకి ఉపయోగించే పండగ సామాగ్రి వరకు.. ప్రతి ఒక్కటి అమెజాన్‌లో మనకి దొరుకుతుంది. అందులో భాగంగానే ఆవు పేడ పిడకల కూడా అమెజాన్‌లో అమ్ముతున్నారు. వీటిని 'కౌవ్ డంగ్ కేక్' అనే పేరుతో విక్రయిస్తుంది. విదేశాల్లోని భారతీయుల దృష్ట్యా .. ఆవు పేడ పిడకలను ఆమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే వీటిని చూసిన డాక్టర్ సంజయ్ ఆరోరా అనే ఓ విదేశీ కస్టమర్... అవి తినే వస్తువులు అనుకున్నాడో ఏమో కానీ వాటిని ఆర్టర్ చేసుకున్నాడు. అవి తిని ఛీ..ఛీ.. వీటి రుచి అస్సలు బాలేదు.. ఇందులో మట్టి, గడ్డి కలిసిందని, ఇవి తిన్న తర్వాత తనకి లూజ్ మోషన్స్ మొదలవ్వడం స్టార్ట్ అయ్యాయని,దయచేసి వీటిని చేసేటప్పుడు కొంచం జాగ్రత్త పాటించండి అంటూ తన రివ్యూని ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇది చూసిన భారత నెటిజన్‌లు అవాక్కవుతున్నారు. పాపం అతడికి ఇవి ఏంటి అనే దానిపైన స్పష్టత లేదని అర్థం అవుతోందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే అమెజాన్ కూడా ఆ ప్రోడక్ట్ కింద ఇవి పండగల కోసం సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసినవి అని స్పష్టంగా పేర్కొంది.