Couple Fire: పెళ్లిలోనే ఒంటికి నిప్పంటించుకున్న వధూవరులు.. షాకింగ్ వీడియో..
Couple Fire: స్టంట్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పెళ్లిలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.;
Couple Fire: ఈమధ్య జరుగుతున్న పెళ్లిళ్లు కొత్త ట్రెండ్‌ను సృష్టించేలాగా ఉన్నాయి. వింత వింత స్టంట్స్‌తో తమ పెళ్లే హైలెట్ అవ్వాలని చాలామంది వధూవరులు కోరుకుంటున్నారు. అందుకోసం ఏం చేయడానికి అయినా వెనకాడట్లేదు. తాజాగా ఓ జంట పెళ్లిలోనే తమ ఒంటికి నిప్పంటించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరిగిపోయేవి. ఎవరో ఒకరు పెళ్లిని ఆర్భాటంగా చేసుకోవడానికి ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతీ పెళ్లికి ఓ స్టైల్ ఉంటుంది. డిఫరెంట్‌గా చేసుకుంటే బాగుంటుంది అని చాలావరకు జంటలు ఆలోచిస్తున్నాయి. అయితే స్టంట్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి తన పెళ్లిలో చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
స్టంట్‌మెన్‌గా పనిచేసే జేమ్ జెస్సోప్, తన భార్య ఆంబిర్ బాంబిర్ మిషెల్‌తో కలిసి ఓ డిఫరెంట్ ఫోటోషూట్‌ను ప్లాన్ చేశాడు. వారిద్దరు పెళ్లయిన తర్వాత తమ ఒంటికి నిప్పంటించుకొని పరిగెత్తారు. కానీ దానికి ముందు వారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇదేమి వింత ఐడియా అని చాలామంది నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.