పొరుగింటివారు పెంచుతున్న కోడిపుంజుల కూతలకు నిద్రపడ్తలేదని ఓ వృద్ధుడు ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కేరళ చోటుచేసుకుంది. పథనంథిట్ట జిల్లా పల్లికల్ కు చెందిన రాధాకృష్ణ ఇంటి పక్కనే అనిల్ అనే వ్యక్తి ఇంట్లో కోడిపుంజులు పెంచుకొంటున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజు తెల్లవారుజాము 3 గంటలకు కొక్కొరోక్కో అంటూ కూతలు వస్తున్నాయి. ఈ విషయంలో రెండిళ్ల మధ్య ఏండ్ల నుంచి లొల్లి నడుస్తుంది. ఇక లాభం లేదని రాధాకృష్ణ అడూర్ ఆర్డీవో ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. అధికారుల బృందం ఆ రెండిళ్లను పరిశీలించింది. పై అంతస్తులో అనిల్ కోడిపుంజులను పెంచుతున్నారని, పొరుగింటికి ఇబ్బందికరంగా ఉన్నమాట నిజమేనని అధికారులు ఆర్టీవోకు రిపోర్టు ఇచ్చారు. దీంతో అనిల్, రాధాకృష్ణలను పిలిచి ఆర్టీవో చర్చించారు. పై అంతస్తులో ఉన్న పౌల్ట్రీ షెడ్డును ఇంటికి దక్షిణం వైపు 14 రోజుల్లో మార్చాలని అనిల్ ను ఆదేశించారు.