Divvela Madhuri : మరో వివాదంలో దివ్వెల మాధురి!

Update: 2025-06-26 07:30 GMT

తిరుమలలో దివ్వెల మాధురి ఇన్స్టా రీల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లిన రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్న దివ్వెల మాదిరి తిరుమలలో సైతం రీల్స్ చేసి వివాదంలో ఇరుక్కుంది. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాధురి చేసిన రీల్స్ వివాదం కావడంతో పాటుగా… భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు రావడంతో టీటీడీ నోటీసులు జారీ చేసింది. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా రీల్స్ చేస్తే ఎలాంటి తప్పు లేదని భక్తుల వాదన. అయితే సన్నిధానం సమీపంలోని విభవ అతిథి గృహం వద్ద దివ్వెల మాధురి రీల్స్ చేశారు. తిరుమల కొండపై రీల్స్ చేసారనే అనుమానం రాకుండా ప్రకృతి, అతిథిగృహం వద్ద రీల్స్ చేయడం కొసమెరుపు. దీనిపై ఎలాంటి విమర్శలు వస్తాయో వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News