Virus : ఇండియాలో తొలి కేసు..బెంగళూరులో 8 నెలల చిన్నారిలో HMPV వైరస్ గుర్తింపు

Update: 2025-01-06 06:48 GMT

చైనాను వణికిస్తున్న HMPV వైరస్‌ తొలి కేసు ఇండియాలో నమోదైంది. బెంగళూరులో మొట్టమొదటి కేసు నమోదైంది. బెంగళూరులోని బాప్టిస్ట్‌ హాస్పిటల్‌లో ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అయితే కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ మాత్రం దీనిని ఇంకా ధృవీకరించలేదు. తమకు ఇంకా ఎలాంటి శాంపిల్స్‌ అందలేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు ల్యాబ్ లో వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపింది. ఇవే శాంపిల్స్‌ను పుణె పంపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు చిన్నారి చైనాలో పర్యటించలేదని స్పష్టం చేశారు. 

Tags:    

Similar News