Viral Video: బైక్ నడుపుతూ ఫోజులు కొడుతూ.. అంతలోనే
Viral Video: అసలే హెవీ మోటార్ బైక్.. ఎంత బాగా నడపడం వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి..;
Viral Video: అసలే హెవీ మోటార్ బైక్.. ఎంత బాగా నడపడం వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఫోటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ అజాగ్రత్తగా నడిపితే అంతే సంగతులు.. ఇంకా అదృష్టం బావుండి ఆమెకు ఏం కాలేదు.. లేకపోతే చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనయ్యేది.
బైక్ నడపడంలో నైపుణ్యం ఉండవచ్చు. కానీ మరీ అంత మూర్ఖత్వం పనికి రాదు.. బాగా వచ్చు కదా మనకేం కాదు కదా అని అనుకోడానికి లేదు.. ఆపద చెప్పి రాదు.. అసలే రోడ్డు మీద డ్రైవింగ్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి పక్కవాళ్లు చేసిన పొరపాటు కూడా మనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది.
అందుకే డ్రైవ్ చేసేటప్పుడు చాలా అలెర్ట్‌గా ఉండాలి. చేసిన తప్పిదం వల్ల ఒక్కోసారి వారే స్వయంగా గాయపడతారు లేదా ఇతరులను గాయపరుస్తారు. భారీ మోటర్‌బైక్‌ను నడపడం అనేది చాలా నైపుణ్యంతో కూడిన బాధ్యతాయుతమైన వ్యవహారం. స్టైల్‌గా నడపాలని ప్రయత్నిస్తే అభాసుపాలు కాక తప్పదు.. ఆపద కూడా కొని తెచ్చుకున్నట్లే.
తాజాగా ఒక రైడ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి భారీ మోటార్‌సైకిల్‌పై వెళుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఆమె తనని వీడియో తీస్తున్న కెమెరా పర్సన్ వైపు చూస్తూ బైక్ నడుపుతోంది. ఆమె తన రైడ్‌ని ఆస్వాదిస్తున్నట్లు సూచిస్తూ నవ్వుతోంది.
కొద్దిసేపటికే ఆ యువతి బ్యాలెన్స్ కోల్పోయి ఎడమ వైపుకు పడిపోయింది, బైక్ కొన్ని అడుగుల ముందుకి జారి పడింది. అదృష్టవశాత్తు ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పటివరకు ఈ వీడియోను 10 లక్షల మందికి పైగా వీక్షించారు.
Presumiendo. 😎 pic.twitter.com/kXAqTStiMf
— ☛ Momentos Virales ☛ (@momentoviral) January 26, 2023