Hen Birthday Celebration: పుట్టినరోజు ఇలా కూడా చేస్తారా..! పెంపుడు కోడికి ఘనంగా బర్త్‌డే వేడుక..
Hen Birthday Celebration: సంబరాలు, వేడుకలు మనకేనా అన్నట్లుగా తమ పెంపుడు జంతువులకు కూడా ఘనంగా నిర్వహించడం చూశాం.;
Hen Birthday Celebration: పుట్టినరోజుకు కాదేదీ అనర్హం.. అన్నది ప్రస్తుత యూత్ ట్రెండ్. సంబరాలు, వేడుకలు మనకేనా అన్నట్లుగా తమ పెంపుడు జంతువులకు పెళ్లిళ్లు, బారసాలలు,శ్రీమంతాలు ఘనంగా నిర్వహించడం చూశాం. ఈ ట్రెండ్ ఇంకో స్టెప్ వేసింది. ఈ జాబితాలోకి కోడి కూడా చేరింది.
సండే వస్తే చాలు కోడి తెగాల్సిందే అనుకునేవారికి భిన్నంగా ఓ కుటుంబం.. కోడికి వేడుకగా బర్త్ డే చేసింది. బంధుగణాన్ని పిలిచి మరీ తాము ముద్దుగా పెంచుకుంటున్న కోడి పుంజుకు ఘనంగా పుట్టునరోజు జరిపించారు. కేక్ కట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.