UP : సమోసా కోసం భర్తపై దాడి: యూపీలో దారుణం

Update: 2025-09-04 07:45 GMT

సమోసాలు తీసుకురాలేదని కోపంతో ఓ మహిళ తన భర్తపై దాడి చేయించిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆగస్టు 30న ఆనంద్‌పూర్‌కు చెందిన శివమ్ భార్య సంగీత, సమోసాలు తీసుకురమ్మని కోరింది. అయితే శివమ్ వాటిని తీసుకురాలేదు. దీంతో కోపంతో ఉన్న సంగీత తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు గ్రామ పెద్ద అవ్‌దేశ్ శర్మ దగ్గర పంచాయితీ ఏర్పాటు చేశారు. పంచాయితీకి శివమ్ తన తల్లి, మరికొందరు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. అదే సమయంలో సంగీత తన తల్లిదండ్రులు, మేనమామ, ఇతర బంధువులతో అక్కడికి వచ్చింది.

ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సంగీత తల్లిదండ్రులు, బంధువులు శివమ్‌పై దాడికి పాల్పడ్డారు. అతడిని తీవ్రంగా కొట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన శివమ్ బంధువులపై కూడా దాడికి దిగారు. గాయపడిన శివమ్, అతని కుటుంబ సభ్యులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News