Ghaziabad: రోడ్డు మీద రీల్స్.. ఇన్‌స్టా ఇన్‌ప్లూయెన్సర్‌కి భారీ ఫైన్
Ghaziabad: తిన్నా, తొంగున్నా అన్నిటినీ రీల్స్ చేస్తూ క్యాష్ చేసుకుంటారు యూట్యూబర్స్. చూసే వాళ్లు ఉంటే పెట్టే వాళ్లదేముంది. ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేస్తుంటారు..;
Ghaziabad: తిన్నా, తొంగున్నా అన్నిటినీ రీల్స్ చేస్తూ క్యాష్ చేసుకుంటారు యూట్యూబర్స్. చూసే వాళ్లు ఉంటే పెట్టే వాళ్లదేముంది. ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేస్తుంటారు..కొన్ని ట్రెండ్ అవుతుంటాయి.. లైకులు, షేర్లు, సబ్‌స్క్రైబర్లు.. దాంతో పాటు మనీ కూడా వచ్చేస్తుంది. ఇంకేం కావాలి. ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అనుకుంటారు.. తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ నడి రోడ్డు మీద రీల్స్ చేయబోయింది. అడ్డంగా బుక్కయింది. అంతే రూ.17000 ఫైన్ కట్టమంటూ ఆర్డర్స్ పాస్ చేశారు ట్రాఫిక్ పోలీసులు.
రద్దీగా ఉండే ఘజియాబాద్ హైవేపై తన కారును మధ్యలో ఆపి తన సోషల్ మీడియా పేజీ కోసం రీల్ చిత్రీకరించడం ప్రారంభించిన మహిళపై నెటిజన్స్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహిదాబాద్ ప్రాంతంలో ఇది జరిగినట్లు పేర్కొంటూ యూపీ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామర్ వైశాలి చౌదరి ఖుటైల్‌గా గుర్తించబడింది.
ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో 650K మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఆమె ఇటీవలి రీల్ ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టింది. ట్రాఫిక్ పోలీసులు ఆమెకు రూ. 17,000 జరిమానా విధించారు. అయితే వైశాలి తాను ఆ వీడియో ఎందుకు చేశానో తన ఫాలోవర్స్‌కి చెబుతానంటూ పోస్ట్ పెట్టింది. కారణమేదైనా ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీద ఆ తిక్క పనులు ఏంటి అంటూ ట్రాఫిక్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.