Bigg Boss Contestant Dating : బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ మహీరా శర్మతో సిరాజ్ డేటింగ్?

Update: 2025-01-30 14:30 GMT

టీమ్ ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం.. మహిరా చేసిన పోస్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో సిరాజ్‌ లైక్‌ కొట్టడంతో పాటు ఫాలో కావడమేనని అందులో పేర్కొన్నాయి. కాగా ఇటీవల ఆశా భోస్లే మనవరాలు, సింగర్ జనై భోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె తనకు సోదరిలాంటిదని సిరాజ్ చెప్పడంతో ఆ వదంతులకు తెరపడింది.

ఈ ఊహాగానాలపై తాజాగా మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించారు. వాటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్టులు ఆమె వద్ద ఈ ప్రశ్న అడగ్గా.. ‘‘అసలు మీరేం మాట్లాడుతున్నారు? బయట వాళ్లు ఎన్నో అంటుంటారు. ఇప్పుడు నా కుమార్తె ఒక సెలబ్రిటీ. దీంతో ఫ్యాన్స్ ఆమెకు ఎవరితోనైనా సంబంధాలు కలిపేస్తారు. వాటన్నింటినీ మనం విశ్వసించాలా? అసలు అలాంటి వార్తలన్నీ తప్పే’’ అని స్పష్టం చేశారు.

ఇక మహీరా శర్మ విషయానికొస్తే.. జమ్మూ కాశ్మీర్లో పలు టెలివిజన్ చానల్స్ నటించి బాగానే పాపులర్ అయ్యింది. అలాగే హిందీ బిగ్ బాస్ 13వ సీజన్లో కంటెస్టెంట్గా పాల్గొని తన ఆట తీరుతో ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పరస్ చాబ్రా అనే నటుడితో ప్రేమలో పడింది. అంతేగాకుండా దాదాపుగా 4ఏళ్ళపాటూ డేటింగ్లో ఉన్నారని, కానీ గత ఏడాది ఈ ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందని పలు వార్తలు బలంగా వినిపించాయి.

Tags:    

Similar News