Yanam : మత్స్యకారులకు జాక్ పాట్.. వలకు చిక్కిన భారీ టేకు చేప

Update: 2025-07-04 06:00 GMT

యానాంలో మత్స్యకారులకు జాక్ పాట్ తగిలింది. జాలర్ల వలకు భారీ టేకు చేప చిక్కింది. భీమరాజు బృందం పడవలో వేటకు వెళ్లగా జీఎంసీ బాలయోగి వారధి సమీపంలో 160 కిలోల బరువు, 8అడుగుల వెడల్పు ఉన్న టేకు చేప వలలో పడింది. దానిని అతి కష్టంమీద ఒడ్డుకు చేర్చారు. ఇది ఎక్కువగా సముద్రంలోనే ఉంటుంది. ఈ చేప గోదావరిలో దొరకడం అరుదైన సంఘటన అని జాలర్లు అన్నారు. ఈ భారీ చేపను వేలంపాటలో పొన్నమండ భద్రం 17వేలకు దక్కించుకున్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ చేప.. ముప్పు వాటిల్లితే తోకతో తీవ్రంగా దాడి చేస్తుందని మత్స్యకారులు తెలిపారు. క్యాన్సర్లు, గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News