పెళ్లి కూతురిలా జాన్వీ కపూర్ .. పిక్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే 'పరం సుందరి'తో ఆడియన్స్ ముందుకు వచ్చి అలరించింది ఈ అమ్మడు. ఇక బాలీవుడ్లో బిజీగా ఉంటూనే, సౌత్ సినిమాల్లోనూ తన మార్క్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోం ది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే ఎన్టీఆర్తో నటించిన 'దేవర' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాన్వీ.. త్వరలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాతో అలరించబోతుంది. ఇక ఈ జాన్వీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడు తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు సంప్రదాయ పెళ్లి కూతురు లుక్లో అదిరిపోయే స్టిల్స్ అభిమానులను ఫిదా చేసింది. ప్రకాశవంతమైన ఎరుపు రంగు లెహంగాలో మరింత అందంగా.. రాయల్గా కనిపించింది. ఈ పిక్స్ కు 'కొన్ని క్షణాలు మీతోనే ఉంటాయి. వాటి అర్థం వల్ల కాదు, అవి మిమ్మ ల్ని ఎలా అనుభూతి చెందిస్తాయో' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.