పాకిస్థాన్ వీధుల్లో కుల్ఫీ విక్రేత.. అచ్చంగా ట్రంప్ మాదిరిగా..
ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. నిజంగా ఏడుగుర్ని చూసినా చూడకపోయినా ఒక్కోసారి ఒకరిద్దరు తారసపడుతుంటారు అచ్చంగా అవే పోలికలతో.;
ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. నిజంగా ఏడుగుర్ని చూసినా చూడకపోయినా ఒక్కోసారి ఒకరిద్దరు తారసపడుతుంటారు అచ్చంగా అవే పోలికలతో. ఈ కుల్ఫీ విక్రేత యొక్క వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
2021లో పాకిస్థాన్‌కు చెందిన ఈ కుల్ఫీ విక్రేత ఇంటర్నెట్‌లో తుఫాను సృష్టించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగా ఉన్న ఆ వ్యక్తి తన ఐస్ క్రీం కార్ట్ ద్వారా కుల్ఫీని అమ్ముతూ పాటలు పాడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంది, పాకిస్తానీ గాయకుడు షెహజాద్ రాయ్ కూడా అతడిని ప్రశంసించారు. “ వాహ్. కుల్ఫీ వాలే భాయ్, క్యా బాత్ హై... అని పోస్ట్ పెట్టారు.
ట్రంప్‌ను పోలి ఉండే కుల్ఫీ విక్రేత పాకిస్తాన్‌లోని పంజాబ్ సాహివాల్ జిల్లాకు చెందినవాడు. స్థానికులు అతన్ని 'చాచా బగ్గా' అని సంబోధిస్తారు. వీడియోలలో, అతను మ్యూజిక్ ఆర్టిస్ట్ లాగా తన మంత్రముగ్ధమైన స్వరంలో పాడటం వినబడుతుంది. " కుల్ఫీ...కుల్ఫీ! ఆ...ఖోయా కుల్ఫీ, కుల్ఫీ, కుల్ఫీ" అంటూ పాటలు పాడుతూ తాను వీధుల్లోకి వచ్చానని స్థానికులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో మరోసారి వైరల్ అయి ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది.
Wah. Qulfi walay bhai, Kya baat ha کھاۓ بغیر مزا آ گیا pic.twitter.com/YJeimzhboJ
— Shehzad Roy (@ShehzadRoy) June 10, 2021