K.A. Paul : నిమిష ప్రియ కోసం యెమెన్‌కు కేఏపాల్.. హౌతీ నాయకుడితో భేటీ

Update: 2025-07-28 15:30 GMT

నిమిష ప్రియను ఉరితీయోద్దని యెమెన్ ప్రభుత్వానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. యెమెన్ వెళ్లిన ఆయన హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీతో భేటీ అయ్యారు. నిమిష ప్రియను క్షమించి విడుదల చేయాలని కోరారు. ఆమె కుటుంబసభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా.. చివరి నమిషంలో అది వాయిదా పడింది.

కాగా యెమెన్‌లో నర్సుగా పనిచేస్తున్న నిమిష ప్రియ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఆమె తన వ్యాపార భాగస్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన వ్యాపార భాగస్వామి తన పాస్ పోర్టు తీసుకుని ఇబ్బందులకు గురిచేసినట్లు గతంలో ఆమె చెప్పింది. పాస్ పోర్టును తీసుకునేందుకు అతడికి మత్తమందు ఇచ్చింది. ఆ మత్తు ఎక్కువ అవడంతో అతడు మరణించాడు. ఈ కేసులో నిమిష అరెస్ట్ అవ్వగా.. నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. ఆమె ఉరిని ఆపేందుకు అటు కేంద్రం సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News