Viral Video: ఆకతాయి అల్లరి.. సింహం నోట్లో వేలు పెట్టాడు.. ఆ తర్వాత..
Viral Video: జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు.;
Viral Video: అడవికి రాజు సింహం. అలాంటి సింహంతోనే ఆటలా..! పులిని దూరం నుండి చూడాలంటేనే భయపడతారు చాలామంది. అలాంటి పులితో ఆకతాయి ఆటలు పనికిరావు. బోనులో ఉన్నా కూడా సింహం దాని వ్యక్తిత్వాన్ని కోల్పోదు. ఈ విషయం ఓ వ్యక్తికి కాస్త ఆలస్యంగా తెలిసింది. అది తెలియక ఓ ఆకతాయి పులితోనే ఆటలాడబోయాడు. చివరిగా ఓ పాఠాన్ని నేర్చుకున్నాడు.
జూ లో జంతువులు అన్నీ బోనులో ఉంటాయి కాబట్టి వాటి వ్యక్తిత్వం ఏంటో ఎవరికీ అర్థం కాదు. అలా అని సింహం సైలెంట్‌గా ఉంది అనుకోవద్దు. ఇటీవల సింహం నోట్లో వేలు పెట్టి రెచ్చగొట్టాడు. ఆ తర్వాత జరిగిందంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
జమైకాలోని ఓ జూకీపర్ సింహం నోటి దగ్గర వేలు పెట్టి దానిని రెచ్చగొట్టాడు. ఒక్కసారిగా సింహం అతడి వేల్లను నోట్లో పెట్టుకుంది. అతడు ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అతడు తన ఉంగరం వేలును కోల్పోయాడు. జూకు వచ్చిన సందర్శకులు ఇదంతా జోక్ అనుకొని వీడియో తీస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Mo-Mo💙 (@Morris_Monye) May 22, 2022