Loco Pilot: రైలును స్టార్ట్ చేసేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టిన లోకో పైలట్.. వీడియో వైరల్..
Loco Pilot: ఓ లోకో పైలట్ పెద్ద సాహసమే చేశాడు. వంతెనపై నిలిచిపోయిన ట్రైన్‌ను తన ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు నడిపాడు.;
Loco Pilot: ముంబైలో ఓ లోకో పైలట్ పెద్ద సాహసమే చేశాడు. వంతెనపై నిలిచిపోయిన ట్రైన్‌ను తన ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు నడిపాడు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరో తేదీన ముంబయి నుంచి బిహార్‌కు గోదాన్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరింది. ముంబై నుంచి 80 కిలోమీటర్ల దూరం రాగనే.. ట్రైన్ ఓ వంతెనపై ఉండగా ఓ ప్రయాణికుడు అనవసరంగా చైన్ లాగాడు. దీంతో ట్రైన్ వంతెనపై నిలిచిపోయింది.
ఇక రైలును స్టార్ట్ చేసేందుకు లోకో పైలట్ తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. వంతెనపై నుంచి కిందకు దిగి ప్రమాదకర స్థితిలో బోగీ కింది పరికరాలు సరిచేశారు. ఇక లోకో పైలట్ ధైర్య సాహసాల్ని దేశమంతా ప్రశంసిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారడంతో.. వీడియోను ఇండియన్ రైల్వే ట్విటర్లో షేర్ చేసింది. అకారణంగా చైన్ లాగొద్దని.. ప్రయాణికులకు సూచించింది.
#WATCH | Thane: Risking life, loco pilot crawls beneath train to start trip pic.twitter.com/NGVrjwplXw
— TOI Mumbai (@TOIMumbai) May 7, 2022