మంచు కుటుంబంలో రచ్చ పై మోహన్‌బాబు ఇంటి పని మనిషి సంచలన విషయాలు బయటపెట్టింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వల్ల గొడవ మొదలైనట్లు చెప్పుకొచ్చింది. అతడు ఓ తప్పు చేయడంతో మనోజ్ బెల్ట్ తీసుకుని ప్రసాద్‌ను కొట్టాడని తెలిపింది. ఆ సమయంలో మోహన్ బాబు కలగా జేసుకుని.. తన స్టాఫ్‌ను కొట్టదనీ.. తానే వాడికి భయం చెబుతాను, నువ్వు చెయ్ వేస్తె ఒప్పుకోను అని మనోజ్ ను నెట్టేసినట్లు తెలిపింది. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు చెప్పింది. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదట. ఆమెకు మనోజ్ కంటే ముందుగా వేరే అతనుతో పెళ్లి అయి పిల్లాడు ఉన్నాడు. అందుకే ఎవరికీ ఇష్టం లేదని తెలిపింది. ఇప్పుడు తండ్రి కొడుకుల వివాదాన్ని పరిష్కరించేందుకు మంచు లక్ష్మి సముదాయించే పని చేసిందిఅని వెల్లడించింది.