మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘పీస్’ అంటూ ఆమె తన కూతురి వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇంట్లో తండ్రి, అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా దానిపై స్పందించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
మోహన్‌బాబు కుమార్తెగా లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘అనగనగా ఓ ధీరుడు’తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దొంగల ముఠా’, ‘ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా?’, ‘దూసుకెళ్తా’, ‘దొంగాట’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా ఆమె ముంబయిలో ఉంటున్న విషయం తెలిసిందే. వృత్తిపరమైన పనుల రీత్యా అక్కడికి షిఫ్ట్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘ముంబయిలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడిషన్స్‌లో పాల్గొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’’ అని ఆమె తెలిపారు.