Viral Video: కాలువలో పడిపోయిన తల్లీ బిడ్డలు.. ఏనుగుకు CPR చేసి రక్షించిన రెస్క్యూ టీం

Viral Video: ఏడాది వయసున్న తన బిడ్డ కాలువలో పడిపోయింది. దానిని ఎలా రక్షించాలో తెలియక తాను కూడా కాలువలోకి దిగింది. ఇద్దరికీ బయటకు వచ్చే మార్గం కనిపించలేదు.

Update: 2023-03-11 10:55 GMT

Viral Video: ఏడాది వయసున్న తన బిడ్డ కాలువలో పడిపోయింది. దానిని ఎలా రక్షించాలో తెలియక తాను కూడా కాలువలోకి దిగింది. ఇద్దరికీ బయటకు వచ్చే మార్గం కనిపించలేదు. పశువైద్యులు, వాలంటీర్ల బృందం తల్లి ఏనుగును పైకి తీసుకువచ్చేందుకు భారీ క్రేన్‌ను ఉపయోగించారు. ఎట్టకేలకు ఏనుగును పైకి తీసుకువచ్చారు. అయితే ఆ ఒత్తిడికి ఏనుగు స్పృహతప్పి పడిపోయింది. దాంతో రెస్క్యూ బృందం ఏనుగు పైకి ఎక్కి కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (CPR) ఇవ్వడం ప్రారంభించారు. వారి ప్రయత్నం ఫలించింది. చివరకు ఏనుగు లేచి కూర్చుంది. ఈలోగా బురదలో పడిన పిల్ల ఏనుగు కూడా బయటకు వచ్చి తల్లి దగ్గరకు వెళ్లింది. బిడ్డ స్పర్శ తగలగానే తల్లికి ప్రాణం లేచి వచ్చింది. ఏనుగును బయటకు తీయడమే కాకుండా, మానవులకు ఉపయోగించే పద్ధతి కంటే భిన్నమైన పద్ధతిని ఉపయోగించి CPR ఇవ్వడం ద్వారా ఏనుగును బతికించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి రెస్క్యూ టీంను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

Tags:    

Similar News