Viral News: కప్పు చాయ్, రెండు సమోసాలు రూ.490లట.. ఏందయ్యా ఇది!!
Viral News: ఓ పక్క దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ప్రభుత్వాలు ఎన్ని ప్రగల్భాలు పలికినా, మరోపక్క ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తేటతెల్లమవుతూనే ఉంది.;
Viral News: ఓ పక్క దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ప్రభుత్వాలు ఎన్ని ప్రగల్భాలు పలికినా, మరోపక్క ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తేటతెల్లమవుతూనే ఉంది. ముఖ్యంగా, విమానాశ్రయాల వంటి ప్రదేశాలలో, ఉత్పత్తులు స్థానిక మార్కెట్ కంటే 5-8 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అదేమంటే ఫ్లైటెక్కిన వాళ్లు ఆ మాత్రం పెట్టలేరా ఏవిటి అంటారు. అందుకే మీ ఇష్టం వచ్చినట్లు అమ్ముతారా అని ఓ ప్రయాణీకురాలు తాను తీసుకున్న టీ, స్నాక్స్‌కు సంబంధించిన రేట్ ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
ఆమె బిజెపి ప్రభుత్వం యొక్క "అచ్ఛే దిన్" ట్యాగ్‌ని స్వైప్ చేసి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ముంబైలో రెండు సమోసాల కోసం రూ.490 చెల్లించాల్సి వచ్చిందని రెండు చిత్రాలను షేర్ చేసింది. ఫరా ఖాన్ ట్విట్టర్‌లో.. "ముంబై విమానాశ్రయంలో 490 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్ మరియు ఒక వాటర్ బాటిల్!! కాఫీ అచే దిన్ ఆ గే హై" అని ట్వీట్ చేసింది.
కొద్దిసేపటికే, ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది, దానిపై నెటిజన్లు కూడా వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. ఒకరు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. అక్కడ కూడా అంతే.. ప్రయాణీకుల జేబులు ఖాళీ చేస్తుంటారు అని పేర్కొన్నారు.
Two samosas, one chai and one water bottle for 490 Rs at Mumbai airport!! Kafi ache din aa gae hain. #Vikas pic.twitter.com/aaEkAD9pmb
— Farah khan (@farah17khan) December 28, 2022