Husband And Wife: ఈ ఎనిమిది అంశాలే భార్యాభర్తల మధ్య గొడవలకు ముఖ్య కారణమట..

Husband And Wife: భార్యభర్తల మధ్య గొడవలకు ముఖ్య కారణాలను ఇవే అని నిపుణులు చెప్తున్నారు.

Update: 2021-11-28 13:15 GMT

Husband And Wife: భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో మనిషి ఏర్పరుచుకునే బంధాల్లో ఈ బంధం చాలా ప్రత్యేకం. ఒకప్పటి కంటే ఇప్పుడే ఇంకా భార్యాభర్తల మధ్య సమానత్వం పెరుగుతోంది. అంతే కాదు.. గొడవలు కూడా పెరుగుతున్నాయి. ఈ గొడవలు ఒక్కొక్కసారి ఊహించని ఘటనలకు దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలను మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గొడవలకు ముఖ్య కారణాలను ఇవే అని నిపుణులు చెప్తున్నారు.

కాలం ఎంత మారుతున్నా.. భార్య.. భర్త చెప్పిన మాటే వినాలని చాలామంది మగవారు అనుకుంటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలకు ఎక్కువశాతం ముఖ్య కారణం ఇదేనట. భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్తే.. అప్పుడు తనకు ఎక్కడలేని కోపం వచ్చేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతే కాక భార్య ఊరికే గొడవలు పడుతూ, వాదనలకు దిగితే కూడా భర్తకు నచ్చదట.

భార్యాభర్తల మధ్య గొడవకు ఈ మధ్య పిల్లలు కూడా కారణమవుతున్నారు. ఇంట్లోని ఉండి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఎక్కవగా భార్యపైనే ఉంటుంది. అలాంటి సమయంలో తను పిల్లలను సరిగ్గా చూసుకోకపోయినా భర్తకు కోపమొచ్చి గొడవలు జరుగుతాయట. శృంగారం కూడా గొడవలకు కారణమవ్వగలదని వారు అంటున్నారు. ఒకరి శృంగారానికి ఆసక్తి చూపిస్తూ.. మరొకరు చూపించకపోతే గొడవ మొదలవుతుందట.

అత్తారింటికి వెళ్లిన తర్వాత.. భర్త కుటుంబాన్ని తన కుటుంబంలాగా చూసుకోవాల్సిన బాధ్యత భార్యదే. అయితే తమ కుటుంబానికి, బంధువులకు భార్య సరిగ్గా మర్యదలు చేయకపోతే భర్తకు కోపం వస్తుందట. వంట సరిగ్గా చేయకపోవడం కూడా మరో కారణం అని నిపుణుల అంచనా. వివాహేతర సంబంధం లాంటివి కూడా గొవడలకు భీజం వేస్తాయి. 

Tags:    

Similar News