Viral Video : తుగ్లక్ సీఎం: జగన్‌ను ఆడిపోసుకున్న మహిళ

సీఎం జగన్‌ పై మండిపడుతున్న మగువలు; డ్వాక్రా మహిళల ఆక్రోశం; తుగ్లక్ సీఎం అంటూ ఘాటు వ్యాఖ్యలు;

Update: 2023-01-04 12:00 GMT

డ్వాక్రా సంఘాల మహిళలు సీఎం జగన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. గత నెలలో ఆదుర్రు గ్రామంలోని డ్వాక్రా నిధులను మళ్లించిన సంఘటనలో వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలు ధర్నా చేశారు.


తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో తమను అన్నపానీయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తున్న విధానంపై ఓ మహిళ విరుచుకపడింది. సీఎం జగన్‌ను దుర్భాషలాడుతూ ఆడిపోసుకుంది. 


అయితే తాజాగా జీవో.నెం.1పై రగడ సాగుతున్న నేపథ్యంలో ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఆమె మాటలను నిజం చేస్తూనే జగన్ తుగ్లక్ పాలనను తలపిస్తున్నారని నెటజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. 



Tags:    

Similar News