Uttar Pradesh : ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త.. బిల్డింగ్ పైనుంచి దూకేసింది

Update: 2025-06-20 06:15 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లా బడౌత్‌ పట్టణంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి హోటలు గదిలో ఉండగా.. అనూహ్యంగా భర్త రావడంతో ఆమె హోటలు పై నుంచి కిందికి దూకింది. ప్రియుడు శోభిత్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ హోటలు గది నుంచి కిందికి దూకి పారిపోతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈమెకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య విభేదాలు ఉండటంతో ఎస్పీ ఆఫీసులోని మహిళా విభాగంలో విరికి కౌన్సెలింగ్​ నడుస్తోంది. శోభిత్‌ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News