ఉత్తర్ ప్రదేశ్ లోని లోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ(36) అనే మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఛైత్ర నవరాత్రి పూజకు ముందు రోజు ఆమె కావాల్సిన సామగ్రి తెప్పించుకున్నారు. కానీ పీరియడ్స్ రావడంతో పూజ చేసుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి సూసైడ్‌కు పాల్పడ్డారు. పీరియడ్స్ అనేది ప్రతి నెలా సహజంగా జరిగేదేనని తాను నచ్చజెప్పినా సోనీ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు.
ముఖేష్ చెప్పిన దాని ప్రకారం, ప్రియాంష నవరాత్రికి ఎంతో ఆసక్తిగా సిద్ధమవుతోంది. పండుగ పట్ల చాలా అంకితభావంతో ఉంది. అయితే, మొదటి రోజే ఆమెకు రుతుస్రావం ప్రారంభమైంది, దీని వలన ఆమె ఉపవాసం ఉండి పూజలు నిర్వహించలేకపోయింది. దీని వలన ఆమె మానసికంగా కలత చెందింది. ముఖేష్ ఆమెను ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా, ఆమె ఓదార్పు పొందలేకపోయింది.