ఖలిస్థానీల చర్యలకు వ్యతిరేకంగా భారత్ కు యూకే మద్దతు

Update: 2023-03-22 08:41 GMT

ఖలిస్థాన్ అనుకూల నిరసనకారులు భారత జెండాను తీసివేసిన తర్వాత భారత సంతతికి చెందిన సంఘం సభ్యులు మంగళవారం లండన్ లోని భారత హైకమిషన్ వెలుపల సంఘీభావ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యూకే పోలీసులు జతకలిశారు. హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ పోలీసులు మద్దతు తెలిపారు. "ప్రతీ ఒక్కరు ప్రశాంతంగా ఉన్నారు. నేను వారిలో భాగం కావాలనుకున్నాను. అందుకే వారితో కలిసి డ్యాన్స్ చేశారు. భారత్ కు ధన్యవాదాలు" అని తెలిపారు యూకే పోలీసు జూబ్లంట్ నిక్.

సంఘీభావ ప్రదర్శనకు నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. కొందరు సంస్థకు చెందినవారై ఉండగా, మిగితావారు స్వతహాగా వచ్చారు. త్రివర్ణపతాకాలతో కూడిన రంగులను తమ ఒంటిపై వేసుకున్నారు. "ఎక్కడినుంచి వచ్చినా మనమంతా ఒక్కటే అని నిరూపించేందుకే ఈ ప్రదర్శన, మాపై ఎవరు దాడి చేసినా మేము ఇక్కడకు వచ్చి మా మద్దతును తెలియజేస్తాం, మేము తలవంచము. జైహింద్" అని భారతీయ సంతతి మహిళ అన్నారు.

ఖలిస్థాన్ అనుకూల నిరసనకారులు మార్చి 19న భారత జెండాను తీసివేశారు. ఇందుకు సంఘీభావంగా భారతసంతతికి చెందిన వారు మంగళవారం భారత హైకమిషన్ వెలుపల సంఘీభావ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News