తాలిబన్ల అరాచకాలు.. 150 మంది కిడ్నాప్...!
అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాలిబన్ల రాజ్యమంటేనే వణికిపోతున్న స్థానికులు...ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.;
అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాలిబన్ల రాజ్యమంటేనే వణికిపోతున్న స్థానికులు...ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. అటు విదేశీయులతోపాటు స్థానికులు ఎలాగైనా దేశం విడిచి వెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు... కాబుల్ ఎయిర్ పోర్టు పరిసరాల్లో వేలాదిమంది పడిగాపులు కాస్తున్నారు.
తాజాగా తాలిబన్ల దృష్టి కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద ఉన్నారిపై పడినట్లు తెలుస్తోంది. కాబుల్ ఎయిర్‌పోర్టు పరిసరాల నుంచి 150 మంది పౌరులను తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ గురైనవారిలో భారతీయులు అధికంగా ఉన్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నట్లు సమాచారం. అపహరణ వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. మరో వైపు ఈ వార్తలను తాలిబన్ ప్రతినిధి ఖండించినట్లు సమాచారం ...VIS
భారత వైమానిక విమానం సీ-130 కాబుల్ నుంచి కొద్ది గంటల క్రితం 85 మంది భారతీయుల్ని తరలించింది. భారత ఎయిర్ ఫోర్స్ విమానం తజకిస్థాన్‌లోని దుషన్‌బేలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అపహరణ గురించి వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అఫ్గాన్‌లో తాజా పరిస్థితులను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది.