Donald Trump : భారత్‌పై 25శాతం ట్యాక్స్.. ట్రంప్ సంచలన ప్రకటన.. కేంద్రం ఏమన్నదంటే..?
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తున్నాడు. ఇప్పటికే వివిధ దేశాలపై ట్రంప్ భారీ పన్నులు విధించాడు. ఆ నిర్ణయాన్ని 90 రోజుల పాటు నిలిపేశాడు. ఇప్పుడు గడువు ముగియడంతో వివిధ దేశాలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో భారత్‌పై 25శాతం పన్ను విధించారు. దీనికి అదనంగా పెనాల్టీలు ఉంటాయని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు.
ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం సుంకాలకు ఇది అదనమా? లేక దీనితో కలిపే 25శాతమా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా పెనాల్టఅలు ఏ మేరకు ఉంటాయన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ట్రంప్ ప్రకటించిన పన్నుల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది.