Israel-Palestine : ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధానికి 500 రోజులు పూర్తి

Update: 2025-02-18 12:00 GMT

2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ భీకరదాడి తో మొదలైన యుద్ధం 500రోజులకు చేరుకుంది. ఇటీవల గాజా స్ట్రిప్ లో గతనెల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రారంభమైంది. ప్రస్తుత కాల్పుల విరమణ దశ మార్చి ప్రారంభం లో ముగుస్తుంది. ఆ తర్వాత శాంతిని ఇరుపక్షాలు కొనసాగిస్తాయా లేక మళ్లీ ఘర్షణకు దిగుతాయా అన్నది తెలియాల్సివుంది. గత ఏడాదిన్నర యుద్ధం గాజాను ధ్వంసం చేసింది. మరుభూమిలా మార్చేసింది. గాజా ఆరోగ్యశాఖ రికార్డులు.. యుద్ధం సృష్టించిన విధ్వంసాన్ని కళ్లకు కడుతున్నాయి.

అక్టోబర్ 7, 2023నాడు హమాస్ దాడిలో 1,200 మంది ఇజ్రాయెలీలు మృతి చెందారు. యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికులు 846 మంది. ఇజ్రాయెల్ పై దూసుకెళ్లిన రాకెట్లు 10,000కి పైగానే ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. 

Tags:    

Similar News