Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో కొత్త సమస్య.. 8 మంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక..
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి.;
Afghanistan (tv5news.in)
Afghanistan: ఆఫ్గానిస్తాన్‌లో రోజు రోజుకీ పరిస్థితి దయనీయంగా మారుతున్నాయి. దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ల హింసలు, ఆకృత్యాలను ఇంతకాలం భరిస్తూ వచ్చిన ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చింది. ఆఫ్గాన్‌లో ప్రస్తుతం ఆకలి చావులు కూడా మొదలుకావడంతో ఆందోళనలు మొదలయ్యాయి.
పశ్చిమ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలితో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆఫ్గాన్ మాజీ చట్టసభ సభ్యుడు మొహమ్మద్ మొహాఖేక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్గాన్ ప్రజలకు తగిన జీవన ప్రమాణాలను సరిపడే విధంగా వారు అందించలేకపోయారని ఆయన విమర్శించారు.
ఆప్గనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని కోరారు. షియా ఇస్లాంను ఆచరించే హజారా ప్రజలు ఆఫ్గాన్‌లో జనాభాలో 9 శాతం ఉన్నారు. హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, వారు గతంలో తాలిబాన్లచే తీవ్రంగా హింసించబడినట్లు తెలుస్తోంది.