Diella AI Albania: గర్భం దాల్చిన అల్బేనియా AI-ఆధారిత మంత్రి .. ఒకేసారి 83 మంది పిల్లలకు జన్మ!
అల్బేనియా ప్రధాని వింత ప్రకటన
ప్రపంచంలోనే మానవేతర మంత్రిని అధికారికంగా తన మంత్రివర్గంలో చేర్చుకున్న మొదటి దేశం అల్బేనియా. ఈ మంత్రిని పూర్తిగా AIతో రూపొందించారు. ఆమెకు డియెల్లా అని పేరు పెట్టారు. డియెల్లా నియామకం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పుడు ఈ AI-సృష్టించిన మంత్రి కూడా గర్భవతి అని నివేదికలు వెల్లడించాయి. డియెల్లా 83 మంది పిల్లలకు జన్మనిస్తుందని చెబుతున్నారు. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామా ఈ సమాచారాన్ని అందించారు. AI నుండి మంత్రిగా మారిన ఆమె ఎలా గర్భవతి అయిందో, ఆమె ఒకేసారి 83 మంది పిల్లలకు ఎలా జన్మనిస్తుందో అని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు మీకోసం..
అల్బేనియన్ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు సభ్యునికి ఒక AI అసిస్టెంట్‌ను సృష్టించాలని పరిశీలిస్తోంది. వారు దీనిని డీయెల్లా గర్భం, 83 మంది పిల్లల జననంతో ముడిపెట్టారు. బెర్లిన్‌లో జరిగిన బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ (BGD)లో మాట్లాడుతూ, అల్బేనియన్ ప్రధాన మంత్రి, “మేము డీయెల్లాతో పెద్ద రిస్క్ తీసుకొని విజయం సాధించాము. డీయెల్లా గర్భవతి, 83 మంది పిల్లలను మోస్తోంది” అని అన్నారు.
అల్బేనియన్ ప్రధాన మంత్రి ప్రకారం, “ఈ పిల్లలు, సహాయకులు, పార్లమెంటులో జరిగే ప్రతి సంఘటనను రికార్డ్ చేస్తారు. మిస్సైన సంఘటనలు, చర్చల గురించి ఎంపీలకు తెలియజేస్తారు. ప్రతి బిడ్డ ఎంపీలకు సహాయకుడిగా వ్యవహరిస్తారు. వారు ఎంపీలకు సూచనలు కూడా అందిస్తారు. వారు తమ తల్లి డీయెల్లా గురించి కూడా తెలుసుకుంటారు అని తెలిపారు.
2026 నాటికి ఈ వ్యవస్థను పూర్తిగా అమలు చేయడానికి అల్బేనియా కృషి చేస్తోంది. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామా మాట్లాడుతూ, “మీరు కాఫీ కోసం బయటకు వెళ్లి పనికి రావడం మర్చిపోయారని అనుకుందాం. ఈ పిల్లలు హాలులో చెప్పిన మాటలను పునరావృతం చేస్తారు. వారు ఎంపీలకు ఎవరిపై ఎదురుదాడి చేయాలో చెబుతారు. నేను తదుపరిసారి వచ్చినప్పుడు, డీలాలో పిల్లల కోసం 83 స్క్రీన్లు కూడా ఉంటాయి” అని అన్నారు.
అల్బేనియా ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా అవినీతి రహితంగా మార్చడానికి డియోల్లాను సెప్టెంబర్‌లో నియమించారు. AI- సృష్టించిన మంత్రిని సాంప్రదాయ అల్బేనియన్ దుస్తులలో ఉన్న మహిళగా చిత్రీకరించారు. పబ్లిక్ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే బాధ్యత డియోల్లాకు అప్పగించారు. అవి 100 శాతం అవినీతి రహితంగా ఉండేలా చూసుకుంటారు.